logo

కొత్తగా 951 మందికి పాజిటివ్‌

జిల్లాలో కొత్తగా 951 మంది కరోనా సోకింది. కొవిడ్‌ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లలో 3,294 చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,62,509 మందికి కరోనా సోకింది. వీరిలో 1,58,122 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రెండు విడతల్లో కలిపి 1,093 మంది మృత్యువాత

Published : 21 Jan 2022 06:24 IST

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా 951 మంది కరోనా సోకింది. కొవిడ్‌ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లలో 3,294 చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,62,509 మందికి కరోనా సోకింది. వీరిలో 1,58,122 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రెండు విడతల్లో కలిపి 1,093 మంది మృత్యువాత పడ్డారు.

జిల్లాలో 15 కేర్‌ సెంటర్లు

జిల్లాలో కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు జిల్లాలో 2,190 పడకలతో 15 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో కళ్యాణదుర్గంలో వాల్మీకి భవన్‌, రాయదుర్గం పాలిటెక్నిక్‌ కళాశాల, గుంతకల్లు ఆయుష్‌, పుట్టపర్తి విదేశీయుల భవన్‌, కదిరిలో సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌, ధర్మవరంలో పాలిటెక్నిక్‌ కళాశాల, రామగిరిలో యువజన శిక్షణ కేంద్రం, ఉరవకొండలో బాలయోగి గురుకులం, హిందూపురంలో టీటీడీ ఫంక్షన్‌ హాలు, బుక్కరాయసముద్రంలో కొర్రపాడు రెసిడెన్షియల్‌ పాఠశాల, తాడిపత్రిలో రజక కళ్యాణ మండపం, అనంతపురంలో అంబేడ్కర్‌ భవన్‌, సీఎల్‌ఆర్సీ, పెనుకొండలో స్కై లాడ్‌ అతిథి భవనం, మడకశిరలో టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు.

ఎస్కేయూ వీసీకి కరోనా

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయనకు జ్వరం రావడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌ అని తేలింది. స్వల్ప లక్షణాలున్నట్లు ఆయన చెప్పారు. విశ్వవిద్యాలయం సమీపంలోని నివాసంలో ఆయన హోంఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం ఎస్కేయూలోని సెమినార్‌హాల్లో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని