logo

భద్రత ఆదమరిస్తే ప్రాణాలు గాల్లోకి..!

తలుపుల మండలం బి.కొత్తపల్లి సమీపంలో కదిరి-పులివెందుల ప్రధాన రెండు వరుసుల రహదారి కోతకు గురైంది. అక్కడే కల్వర్టు ప్రమాదకరంగా మారినా అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని వాహనచోదకులు, సమీప గ్రామస్థులు వాపోతున్నారు. గతేడాది కురిసిన

Published : 21 Jan 2022 06:24 IST

తలుపుల, న్యూస్‌టుడే: తలుపుల మండలం బి.కొత్తపల్లి సమీపంలో కదిరి-పులివెందుల ప్రధాన రెండు వరుసుల రహదారి కోతకు గురైంది. అక్కడే కల్వర్టు ప్రమాదకరంగా మారినా అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని వాహనచోదకులు, సమీప గ్రామస్థులు వాపోతున్నారు. గతేడాది కురిసిన కుండపోత వర్షాల కారణంగా మండలంలో వంకలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ ధాటికి పలు రోడ్లు దెబ్బతిన్నాయి. కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకొనేవారు కరవైయ్యారు. బి.కొత్తపల్లి కల్వర్టు వద్ద వంద అడుగులవరకు రోడ్డు కోతకు గురైనా సంబంధిత అధికారులు మరమ్మతులు చేయలేదు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల భద్రతను అధికారులు గాలికి వదిలేశారనే విమర్శలున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టును బాగుచేయించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని