logo

వ్యాక్సినేషన్‌ ముమ్మరం

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రోత్సహించేందుకు కేర్‌ ఇండియా సంస్థ ‘టీకా వేసుకో బహుమతి తీసుకో’ కార్యక్రమం చేపట్టింది. పెనుకొండ, కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 25 టీకా వాహనాలు, 80 మంది సిబ్బందితో పలు మండలాల్లో 1,01,890

Published : 21 Jan 2022 06:24 IST

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రోత్సహించేందుకు కేర్‌ ఇండియా సంస్థ ‘టీకా వేసుకో బహుమతి తీసుకో’ కార్యక్రమం చేపట్టింది. పెనుకొండ, కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 25 టీకా వాహనాలు, 80 మంది సిబ్బందితో పలు మండలాల్లో 1,01,890 మందికి టీకాలు వేశారు. టీకాలు వేసుకున్న వారికి పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్రతి పీహెచ్‌సీ కేంద్రానికి 18 బహుమతుల చొప్పున, కళ్యాణదుర్గం డివిజన్‌ పరిధిలో పీహెచ్‌సీలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా గురువారం టీకాల కార్యక్రమం జిల్లా పర్యవేక్షణాధికారి యుగంధర్‌ బహుమతుల లక్కీడ్రా తీశారు. మొదటి బహుమతిగా మూడు మిక్సీలు, రెండో బహుమతిగా 5 మందికి కుక్కర్లు, మూడో బహుమతిగా 10 మందికి డిజిటల్‌ బీపీ ఆపరేటర్లు అందజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని