logo

వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి

రాష్ట్రంలో వైకాపా అరాచకాలు, విధ్వంస పాలన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. అనంతపురం నగరంలో గురువారం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్‌ అధ్యక్షతన ముఖ్యనేతలు, కార్యకర్తల

Published : 21 Jan 2022 06:24 IST


మాట్లాడుతున్న సోము వీర్రాజు, పక్కన నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, చిరంజీవిరెడ్డి తదితరులు

అరవిందనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచకాలు, విధ్వంస పాలన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. అనంతపురం నగరంలో గురువారం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్‌ అధ్యక్షతన ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి మాట్లాడుతూ.. వైకాపాకు 150 సీట్లు కట్టబెట్టి అధికారంలోకి తెచ్చినా ప్రజల మనోభీష్టాలను కాదని అధికార దర్పంతో సాగిస్తున్న పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని హెచ్చరించారు. సమావేశం అనంతరం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పెండింగ్‌ ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నామస్మరణ మినహా.. ఈ ముఖ్యమంత్రికి మరో ధ్యాస ఏదీ లేదు. రాష్ట్రంలోని హంద్రీ-నీవా, గాలేరు నగరి పెండింగ్‌ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వానికి అక్కర లేదా?. వీటి గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని భాజపా ప్రశ్నిస్తోంది. రూ.65 వేల కోట్లతో జాతీయ రహదారులు, రైలు మార్గాల అభివృద్ధి.. కర్నూలు, తిరుపతి, విజయవాడల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేసింది. గనులను జాతీయం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం మాత్రం బస్టాండ్లను తాకట్టుపెడుతోంది. మాట తప్పను.. మడమ తిప్పను అని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు ఇస్తున్న నిధులు కూడా లాక్కుంటున్నారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించకుండా వ్యాపారాలు చేస్తోంది. ఇసుకను అమ్ముకున్నారు. సిమెంటు ధర పెంచారు. భాజపా అధికారంలోకి వస్తే చౌకగా ఇసుక, రూ.200లకు సిమెంటు బస్తా విక్రయిస్తాం. సీమలో సస్య విప్లవం తెస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, లలిత్‌కుమార్‌, వెంకటేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, సూర్యప్రకాశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని