logo

కార్యశాల అడ్డగింత

మండలంలోని ఆర్టీటీ ఆడిటోరియంలో గురువారం నూతన జాతీయ విద్యావిధానంపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ కేంద్రాల సిబ్బందికి ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాప్టో సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్ర

Published : 21 Jan 2022 06:24 IST


సమావేశాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

రాప్తాడు, అనంతపురం విద్య, న్యూస్‌టుడే: మండలంలోని ఆర్టీటీ ఆడిటోరియంలో గురువారం నూతన జాతీయ విద్యావిధానంపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ కేంద్రాల సిబ్బందికి ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫ్యాప్టో సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకూ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో సమావేశానికి హాజరైన డీఈవో శామ్యుల్‌, స్టేట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

నాణ్యమైన విద్యకు పునాది వేయండి

అంతకుముందు రాష్ట్ర ఆదర్శ పాఠశాలల సంచాలకులు, పాఠశాల విద్య పరిశీలకులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు పునాది వేసేందుకు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో భౌతిక వనరులు మెరుగుపరిచేందుకు నాడు- నేడు కార్యక్రమం లాగానే విద్యలో నాణ్యత పెంపొందించడానికి నాడు-నేడు అకడమిక్‌ను ప్రభుత్వం చేపడుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు నియమనిబంధనల ప్రకారం మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఈ నెల 22వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు