logo

వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో తనిఖీలు

కణేకల్లు వ్యవసాయ వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌ కార్యాలయ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు నేపథ్యంలో అదనపు డైరెక్టరు వినయ్‌చంద్‌, సహాయ డైరెక్టరు మునీశ్వరప్రసాద్‌ నేతృత్వం

Published : 21 Jan 2022 06:24 IST

క్షేత్రాన్ని పరిశీలిస్తున్న కమిషనరేట్‌ అధికారులు

కణేకల్లు, న్యూస్‌టుడే: కణేకల్లు వ్యవసాయ వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌ కార్యాలయ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు నేపథ్యంలో అదనపు డైరెక్టరు వినయ్‌చంద్‌, సహాయ డైరెక్టరు మునీశ్వరప్రసాద్‌ నేతృత్వంలో తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో విత్తన వరి దిగుబడి ఏ మేరకు వచ్చిందనే వివరాలను జేడీఏ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమించిన సస్యరక్షణ ఏడీఏ విద్యావతి, భూసంరక్షణ ఏడీఏ మద్దిలేటిని అడిగి తెలుసుకొన్నారు. క్షేత్రాధికారి పదేళ్లుగా ఇక్కడే తిష్టవేసి విధులు నిర్వహించడం, వచ్చిన దిగుబడి వివరాల నమోదు వంటి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, అందుకు సంబంధించి బిల్లులు లేకపోవడం గుర్తించారు. పదేళ్ల కాలంలో వచ్చిన దిగుబడి వివరాలు, ఏ జిల్లాకు ఎంత విత్తనం పంపారు, ఎంత సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేశారనే వివరాలపై క్షేత్రాధికారి సనావుల్లాను ఆరా తీశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, పొంతన లేని సమాధానం చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గోదాముల్లో నిల్వ చేసిన విత్తన వరి దిగుబడి, విత్తనోత్పత్తి క్షేత్రాన్ని పరిశీలించారు. క్షేత్రం చుట్టూ ఉన్న కంచె ఏమైందని క్షేత్రాధికారిని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నా కమిషనరేట్‌ అధికారులు తనిఖీలు చేపట్టి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని