logo

జిల్లా యువతకుత్వరలో ఉద్యోగాలు

రాప్తాడు జాతీయ రహదారి సమీపంలోని హర్మోనీసిటీ సంస్థలో 120 ఎకరాల్లో ఐటీ పార్కు నిర్మించి, అనంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హర్మోనీ సిటీ ఎండీ రవికుమార్‌ తెలిపారు. సంస్థ కార్యాలయంలో గురువారం విలేకరులతో సమావేశం నిర్వహించారు.

Published : 21 Jan 2022 06:24 IST


ఎండీ రవికుమార్‌

రాప్తాడు, న్యూస్‌టుడే: రాప్తాడు జాతీయ రహదారి సమీపంలోని హర్మోనీసిటీ సంస్థలో 120 ఎకరాల్లో ఐటీ పార్కు నిర్మించి, అనంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హర్మోనీ సిటీ ఎండీ రవికుమార్‌ తెలిపారు. సంస్థ కార్యాలయంలో గురువారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. రవికుమార్‌ మాట్లాడుతూ.. హర్మోనీసిటీ సంస్థలో ప్రస్తుతం ఏడు ప్రైవేటు కంపెనీలు స్థాపించేందుకు ఒప్పదం కుదుర్చుకున్నామన్నారు. అన్ని వసతులతో అపోలో ఆసుపత్రి నిర్మించి రోగులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ సీీఈవో నందకిషోర్‌రెడ్డితో కలిసి ఐటీ పార్కు భూమి పూజ చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించామన్నారు. త్వరలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని