logo

టీఎన్‌టీయూసీ కార్మికులకు అండగా నిలవాలి

అన్ని వర్గాల కార్మికులకు తెలుగు నాడు ట్రేడ్‌ యూనియన్‌ (టీఎన్‌టీయూసీ) అండగా నిలవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం పార్లమెంటు తెదేపా కార్యాలయంలో టీఎన్‌టీయూసీ పార్లమెంటు కమిటీని గురువారం ఎంపిక చేశారు. ప్రభుత్వం అన్ని

Published : 21 Jan 2022 06:26 IST

టీఎన్‌టీయూసీ జిల్లా కమిటీని ప్రకటిస్తున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

అనంతపురం(రాణినగర్‌), న్యూస్‌టుడే: అన్ని వర్గాల కార్మికులకు తెలుగు నాడు ట్రేడ్‌ యూనియన్‌ (టీఎన్‌టీయూసీ) అండగా నిలవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం పార్లమెంటు తెదేపా కార్యాలయంలో టీఎన్‌టీయూసీ పార్లమెంటు కమిటీని గురువారం ఎంపిక చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని విస్మరించిందన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, టీఎన్‌టీయూసీ పార్లమెంటు అధ్యక్షుడు మేకల వెంకటేశ్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి జిలాన్‌, రాష్ట్రకమిటీ సభ్యులు నాగభూషణం పాల్గొన్నారు.

నూతన కమిటీ ఇదే

మొత్తం 40మందితో కమిటీని ఎంపిక చేశారు. అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడిగా మేకల వెంకటేశ్‌గౌడ్‌(అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా జిలాన్‌(గుంతకల్లు)ను ఎంపిక చేశారు. 8మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు అధికార ప్రతినిధులు, 9మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9మంది కార్యదర్శులు, మరో ఆరుగురికి వివిధ హోదాలు కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని