logo

గణతంత్ర వేడుకలపై సమీక్ష

కొవిడ్‌ మూడో ఉద్ధృతి కొనసాగుతున్న క్రమంలో తగిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ నిశాంత్‌కుమార్‌లతో

Published : 22 Jan 2022 04:25 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, పక్కన ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు నిశాంత్‌, గంగాధర్‌గౌడ్‌, ఉప కలెక్టర్‌ నవీన్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మూడో ఉద్ధృతి కొనసాగుతున్న క్రమంలో తగిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని గణతంత్ర వేడుకలు నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ నిశాంత్‌కుమార్‌లతో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఈనెల 26న గణతంత్ర దిన వేడుకలను జాతీయ సమైక్యతా స్ఫూర్తి ఉట్టిపడేలా చేపట్టాలన్నారు. పోలీసు పరేడ్‌ మైదానంలో కొవిడ్‌ నిబంధనలపై ప్రచారం చేయాలని, ఆ మేరకు బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్కు లేనిదే ఎవరినీ అనుమతించొద్దన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. పది నుంచి 12 మాత్రమే శకటాలు ఉండేలా చూడాలని అధికారులకు నిర్దేశించారు. ఈ వేడుకల సందర్భంగా అవార్డులకు ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా ఉండాలన్నారు. ఉత్తమ పనితీరు, మంచి రికార్డు కల్గిన వారిని ఎంపిక చేయాలని, శనివారంలోగా ఆయా శాఖల నుంచి జాబితాలు డీఆర్వో కార్యాలయానికి అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ గంగాధర్‌గౌడ్‌, పెనుకొండ ఉప కలెక్టర్‌ నవీన్‌, శిక్షణ కలెక్టర్‌ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని