logo

తెదేపాతోనే మహిళా సాధికారత

తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని తెదేపా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా కార్యాలయంలో అనంత పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళా నూతన కమిటీని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌ

Published : 22 Jan 2022 04:25 IST


తెలుగు మహిళ కమిటీని ప్రకటిస్తున్న కాలవ శ్రీనివాసులు, శ్రీధర్‌చౌదరి, స్వప్న తదితరులు

రాణినగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని తెదేపా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా కార్యాలయంలో అనంత పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళా నూతన కమిటీని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్నతో కలిసి ప్రకటించారు. వారు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని ధరలు పెంచుతూ పోయింది తప్ఫ. తగ్గించింది లేదన్నారు.

నూతన కమిటీ ఇదే..

కమిటీలో మొత్తం 30మందికి అవకాశం కల్పించారు. అధ్యక్షురాలిగా స్వరూప, ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక, ఉపాధ్యక్షులుగా జ్యోతి, సరోజమ్మ, విజయలక్ష్మి, మణెమ్మ, అధికార ప్రతినిధులుగా వెంకటనారాయణమ్మ, కృష్ణకుమారి, వసుంధర, పద్మావతి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా నాగవేణి, బుజ్జమ్మ, అంజినమ్మ, అరుణ, కృష్ణవేణి, లక్ష్మిదేవి, రామలక్ష్మమ్మ, కార్యదర్శులుగా లోకేశ్వరి, లక్ష్మీదేవి, అనురాధ, షరీనా, ఇందిరమ్మ, మహేశ్వరి, సావిత్రమ్మ, ప్రచార కార్యదర్శిగా దేవి ఎంపికయ్యారు. అనంతపురం నియోజకవర్గం అధ్యక్షురాలిగా విజయశ్రీరెడ్డి, రాయదుర్గానికి భారతి, గుంతకల్లుకు అంజలి, తాడిపత్రికి ఫాతిమా, శింగనమలకు జ్యోతిని అధ్యక్షులుగా నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని