logo

‘వెలుగు’లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

యాడికి మండల ఏపీఎం హేమలత, కోనుప్పలపాడు క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ శేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 7న ‘వెలుగులో చీకటి కోణం’ అనే శీర్షికన వెలువడిన కథనానికి స్పం

Published : 22 Jan 2022 04:25 IST

యాడికి, న్యూస్‌టుడే: యాడికి మండల ఏపీఎం హేమలత, కోనుప్పలపాడు క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ శేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 7న ‘వెలుగులో చీకటి కోణం’ అనే శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు నలుగురు అధికారులతో విచారణ చేపట్టారు. గత నెల 16న డీపీఎం రామిరెడ్డి, స్త్రీనిధి ఏజీఎం కామాక్షయ్య, ఉన్నతి ఏపీఎం సుభద్రమ్మ, ఏరియా కోఆర్డినేటర్‌ రవీంద్రబాబులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదికను అందజేసింది. గ్రామస్థాయిలో మరికొన్ని బృందాలు విచారణ చేపట్టడంతో మరిన్ని అవకతవకలు బహిర్గతమయ్యాయి. ఏపీఎం హేమలత రూ.2.04 లక్షలు, సీసీ శేఖర్‌ రూ.6,64,967 సభ్యుల సొమ్మును బ్యాంకులో జమ చేయకపోవడమేగాక ఇద్దరూ మరో రూ.24,19,846 నిధుల దుర్వినియోగానికి, రూ.21,37,786 నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు విచారణలో తేలింది. క్లస్టర్‌ యానిమేటర్ల పనితీరు సక్రమంగా లేకపోయినా, సభ్యులు చెల్లించిన సొమ్ముకు, బ్యాంకుల్లో జమచేస్తున్న సొమ్ముకు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ పర్యవేక్షణే లేకుండా పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటన్నింటికీ ఏపీఎం, సీసీలను బాధ్యులను చేస్తూ విచారణాధికారులు నివేదిక సమర్పించడంతో వారిని సస్పెండ్‌ చేస్తూ పీడీ ఉత్తర్వులు జారీ చేశారని ఏరియా కోఆర్డినేటర్‌ రవీంద్రబాబు వివరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని