logo

సామాన్యులకు విద్యుత్తు బిల్లు షాక్‌

స్థానిక సప్తగిరి కాలనీకి చెందిన నవకోటి భార్గవ్‌కు విద్యుత్తు శాఖ సిబ్బంది ఇంటి బిల్లు పేరుతో షాక్‌కు గురి చేశారు. ఏకంగా రూ.27,814 బిల్లు రావడంతో ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. భార్గవ్‌ తమకున్న ఇంటిపై

Published : 22 Jan 2022 04:25 IST

మొత్తం రూ.27,814 వచ్చిన విద్యుత్తు బిల్లు

 

సోమందేపల్లి, న్యూస్‌టుడే: స్థానిక సప్తగిరి కాలనీకి చెందిన నవకోటి భార్గవ్‌కు విద్యుత్తు శాఖ సిబ్బంది ఇంటి బిల్లు పేరుతో షాక్‌కు గురి చేశారు. ఏకంగా రూ.27,814 బిల్లు రావడంతో ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. భార్గవ్‌ తమకున్న ఇంటిపై అంతస్తులో మూడు గదులను మూడు కుటుంబాలకు అద్దెకిచ్చారు. ప్రతినెల రూ.100-150 వరకు విద్యుత్తు బిల్లు వచ్చేది. బిల్లు మొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తున్నారు. వీటికి చెందిన మీటర్‌ (73343442006948)కు ఈ నెలలో మొత్తం రూ.27,814లు బిల్లు చెల్లించాలని శుక్రవారం రీడింగ్‌ సిబ్బంది రసీదు ఇచ్చారు. బాధితుడు వెంటనే కార్యాలయానికి వెళ్లి విద్యుత్తు ఏఈ సంజీవప్పను కలసి పరిస్థితిని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏఈ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ విద్యుత్తు బిల్లులు ఇచ్చే సిబ్బంది ఇంటిపైనున్న గదుల వద్ద విద్యుత్తు మీటర్‌లో రీడింగ్‌ చూడకుండా బిల్లు రసీదులు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. అధిక బిల్లు వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లామని, న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని