logo

ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్విచక్ర వాహనయాత్ర కదిలించాలని వక్తలు పేర్కొన్నారు. ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘రైతు ,కూలీ రక్షణ ద్విచక్ర వాహన యాత్ర

Published : 22 Jan 2022 04:25 IST


ద్విచక్ర వాహన యాత్రలో ఏపీ రైతు సంఘం, కార్మిక సంఘం నాయకులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్విచక్ర వాహనయాత్ర కదిలించాలని వక్తలు పేర్కొన్నారు. ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘రైతు ,కూలీ రక్షణ ద్విచక్ర వాహన యాత్ర’ శుక్రవారం అనంతపురంలో ప్రారంభమైంది. నగరంలో గడియార స్తంభం వద్ద ఈ యాత్రను మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం బాషా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.రాంభూపాల్‌ అధ్యక్షతన జరుగుతున్న యాత్ర ఈ నెల 24న అమరావతికి చేరుకుంటుంది. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరంగయ్య, కృష్ణమూర్తి, జిల్లా నాయకులు శివారెడ్డి, రామిరెడ్డి, సావిత్రి, ముస్కిన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని