logo

వీఆర్వోపై కేసు నమోదు

తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన ధ్రువపత్రం మంజూరు చేసిన మల్లమీదపల్లి వీఆర్వో నరసింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మల్లమీదపల్లికి చెందిన రామాంజులమ్మ

Published : 22 Jan 2022 04:26 IST

గాండ్లపెంట: తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన ధ్రువపత్రం మంజూరు చేసిన మల్లమీదపల్లి వీఆర్వో నరసింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మల్లమీదపల్లికి చెందిన రామాంజులమ్మ ప్రావిడెంట్‌ ఫండ్‌ పొందేందుకు జనన ధ్రువపత్రం కోసం వీఆర్వోకు దరఖాస్తు చేశారు. వీఆర్వో అవకతవకలకు పాల్పడి గతేడాది నవంబరు 21న తహసీల్దార్‌ ఫోర్జరీ సంతకంతో కూడిన ధ్రువపత్రాన్ని మంజూరు చేశారు. తహసీల్దార్‌ వెంకటరమణ ఫిర్యాదు మేరకు వీఆర్వోను విచారించగా నల్లమాడ మండలం రెడ్డిపల్లి సమీపంలోని బపనకుంటకు చెందిన కృష్ణారెడ్డికి రూ.1500 అందజేసి విశ్రాంత తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. కృష్ణారెడ్డిపై గతంలో అనేక కేసులు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. సదరు వీఆర్వో మల్లమీదపల్లికి చెందిన సుభాన్‌ నుంచి రూ.5 వేలు తీసుకొని జనన ధ్రువపత్రం ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. సుభాన్‌, కృష్ణారెడ్డిని విచారిస్తున్నామని, ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని