logo

జ్వర సర్వే చేపట్టండి

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో ఇంటింటా జ్వర సర్వేపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు 95 శాతంపై సర్వే పూర్తికావాలని కలెక్టర్‌ నాగలక్ష్మి నిర్దేశించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్సు

Published : 23 Jan 2022 03:17 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, పక్కన జేసీ సిరి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో ఇంటింటా జ్వర సర్వేపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు 95 శాతంపై సర్వే పూర్తికావాలని కలెక్టర్‌ నాగలక్ష్మి నిర్దేశించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్సు హాలులో జేసీ డాక్టర్‌ సిరితో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం నాలుగో విడత జ్వర సర్వే సోమవారం ప్రారంభించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు ఆదివారమే తమ పరిధిలో వైద్యాధికారులు, ఏఎన్‌ఎం, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలతో సమీక్ష జరపాలన్నారు. ప్రతి రోజూ 20 శాతం ఇళ్లను తిరగాలి. ఏవైనా కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలి. అవసరమైన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలని ఆదేశించారు. శనివారం లక్ష డోసుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే 70 వేల మందికి టీకా వేశారన్నారు. ఆదివారం కూడా లక్ష డోసులు టీకా వేసేలా పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. మరోవైపు లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు ఫిర్యాదులు వస్తే సంబంధిత గృహ నిర్మాణ ఏఈలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఆర్డీ నాగరాజు, కమిషనర్‌ మూర్తి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వర్‌ ప్రసాద్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ కేశవనాయుడు, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఎల్‌డీఎం వెంకటరాజు, స్పందన తహసీల్దార్‌ అనుపమ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని