logo

బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాల్సిందే

జీవిత బీమా ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి లియాఫీ యూనియన్‌ యాజమాన్యంపై నిరంతరం పోరాటం సాగిస్తుందని కడప డివిజన్‌ కో కన్వీనర్‌ తిరుపతయ్య పేర్కొన్నారు. నగరంలోని ఎల్‌ఐసీ శాఖ-1 కార్యాలయంలో శనివారం సంఘం అధ్యక్షుడు కాటమయ్య ఆధ్వర్యంలో బీమా ఏజెంట్ల సమావేశం

Published : 23 Jan 2022 03:17 IST


మాట్లాడుతున్న కడప డివిజన్‌ కోకన్వీనర్‌ తిరుపతయ్య

అనంతపురం (అరవిందనగర్‌), న్యూస్‌టుడే: జీవిత బీమా ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి లియాఫీ యూనియన్‌ యాజమాన్యంపై నిరంతరం పోరాటం సాగిస్తుందని కడప డివిజన్‌ కో కన్వీనర్‌ తిరుపతయ్య పేర్కొన్నారు. నగరంలోని ఎల్‌ఐసీ శాఖ-1 కార్యాలయంలో శనివారం సంఘం అధ్యక్షుడు కాటమయ్య ఆధ్వర్యంలో బీమా ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పెంపుదల, కొవిడ్‌ బాధితులకు అడ్వాన్స్‌ మంజూరు తదితర సమస్యలను పరిష్కరించేందుకు లియాఫీ యూనియన్‌ కృషి అభినందనీయమన్నారు. కన్వీనర్‌ ప్రభాకరనాయుడు మాట్లాడుతూ పాలసీదారులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండు చేశారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు మల్లికార్జునరెడ్డి, మంజునాథరెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వర్‌ ప్రసాద్‌, వసంతకుమార్‌, భాస్కర్‌, వేణుగోపాల్‌, సుబ్బారావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడప డివిజన్‌కు కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్‌ నూతన సంఘం అధ్యక్షుడిగా వై.ప్రభాకరనాయుడు, కార్యదర్శి కె.వెంకటేశులు, కోశాధికారిగా మల్లికార్జునయ్య ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని