logo

తహసీల్దారు, వీఆర్వోల సంతకాలు ఫోర్జరీ

తహసీల్దారు, వీఆర్వోల సంతకాలు ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని 77 సెంట్ల భూమిని కబ్జాదారులు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తమ పేరిట ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయించుకున్నారు. కబ్జాదారులు మొదటగా గుంతకల్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం,

Published : 23 Jan 2022 03:24 IST

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: తహసీల్దారు, వీఆర్వోల సంతకాలు ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని 77 సెంట్ల భూమిని కబ్జాదారులు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తమ పేరిట ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయించుకున్నారు. కబ్జాదారులు మొదటగా గుంతకల్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, బుక్కపట్నంలోని మండల జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించాలని ప్రయత్నించగా సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సంబంధిత అధికారులు తిరస్కరించారు. ఎలాగైనా భూమిని తమ పేరిట రిజిస్టర్‌ చేసుకోవాలని సదురు భూమి తమ అనుభవంలో ఉన్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అందులో తహసీల్దారు రాము, వీఆర్వో శ్రీనివాసరెడ్డిల సంతకాలను ఫోర్జరీ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు ఫోర్జరీకి పాల్పడిన వారిపై టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని