logo

తాగునీటి పైపులైన్‌కు రూ.4 కోట్లు

ఆత్మకూరు నుంచి అనంతపురం గ్రామీణం కక్కలపల్లికాలనీ, పాపంపేట గ్రామ పంచాయతీలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్‌ నిర్మాణానికి మండల నిధుల కింద రూ.4 కోట్లు కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేసినట్లు రాప్తాడు ఎమ్మెల్యే తో

Published : 20 May 2022 03:23 IST


కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, తదితరులు

జిల్లా వ్యవసాయం, జిల్లా సచివాలయం: ఆత్మకూరు నుంచి అనంతపురం గ్రామీణం కక్కలపల్లికాలనీ, పాపంపేట గ్రామ పంచాయతీలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్‌ నిర్మాణానికి మండల నిధుల కింద రూ.4 కోట్లు కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేసినట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. కక్కలపల్లి కాలనీ పంచాయతీ మహిళలు గురువారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో గురువారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే స్పందించి, కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీల్లో నీటి సమస్య అధికంగా ఉందని, త్వరలో టెండర్లు పిలిచేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతపురం గ్రామీణం సోమలదొడ్డి పంచాయతీలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని 300 మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు