logo

కోడిగుడ్లును ఎక్కువ సేపు ఉడకబెట్టారు!

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన కోడిగడ్లు చెడిపోలేదని అధికారులు తేల్చారు. ఎక్కువ సేపు ఉడకబెట్టడంతోనే నల్లరంగు కనిపిస్తోందని నిర్ధారించారు. ‘అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లు!’ శీర్షికన గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన

Published : 20 May 2022 03:23 IST


కోడిగుడ్లను పరిశీలిస్తున్న సీడీపీఓ లలిత

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన కోడిగడ్లు చెడిపోలేదని అధికారులు తేల్చారు. ఎక్కువ సేపు ఉడకబెట్టడంతోనే నల్లరంగు కనిపిస్తోందని నిర్ధారించారు. ‘అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లు!’ శీర్షికన గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తకు ఐసీడీఎస్‌ పీడీ సుశీలాదేవి స్పందించారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ అనంతపురం నగర ప్రాజెక్టు సీడీపీఓ లలితను ఆదేశించారు. సీడీపీఓ లలిత రాణినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం-8ను పరిశీలించారు. అప్పటికప్పుడే లబ్ధిదారులను పిలిపించి పంపిణీ చేసిన గుడ్లు చెడిపోయాయా.. బాగున్నాయా అని ఆరా తీశారు. కేంద్రంలో కొన్ని గుడ్లను ఉడకబెట్టారు. ఎక్కువ సేపు ఉడకబెట్టినవి గుడ్డులోపల నల్లరంగు వచ్చింది. సాధారణంగా ఉడకబెట్టినవి బాగున్నాయి. ఇదే అంశాన్ని నివేదిక రూపంలో పీడీకి సమర్పించారు. కార్యక్రమంలో 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుమతి, 4వ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ త్రివేణి, ఏఎన్‌ఎం నసీబా, అంగన్‌వాడీల సంఘం నగర అధ్యక్ష,కార్యదర్శులు జమున, నక్షత్ర, స్థానిక ఎంఎస్‌కే, వార్డు కార్యదర్శి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని