logo

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేద్దాం

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి గరికపాటి దీనబాబు అన్నారు. ఐసీడీఎస్‌ అధ్వర్యంలో బృందాలు నగరంలోని పలు కాలనీల్లో గురువారం దాడులు నిర్వహించారు. దుకా

Published : 20 May 2022 03:23 IST


మాట్లాడుతున్న న్యాయమూర్తి దీనబాబు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి గరికపాటి దీనబాబు అన్నారు. ఐసీడీఎస్‌ అధ్వర్యంలో బృందాలు నగరంలోని పలు కాలనీల్లో గురువారం దాడులు నిర్వహించారు. దుకాణాలు, పరిశ్రమల్లో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించి జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యాలయంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లలను ఉన్నత విద్య చదివించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని