బస్సుకిందపడి యువకుడి దుర్మరణం

ఉన్నత చదువు చదివిన తమ ఒక్కగానొక్క కుమారుడు.. ఉద్యోగం చేసి ఇంటిని పోషిస్తానంటూ ఎప్పుడూ తల్లిదండ్రులతో చెబుతూ ఉద్యోగాన్వేషణలో ఉంటూ.. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి దుర్మరణం చెందాడు.

Updated : 20 May 2022 05:20 IST

ముగ్గురికి తీవ్రగాయాలు


అబ్రార్‌ (పాతచిత్రం)

లేపాక్షి, న్యూస్‌టుడే: ఉన్నత చదువు చదివిన తమ ఒక్కగానొక్క కుమారుడు.. ఉద్యోగం చేసి ఇంటిని పోషిస్తానంటూ ఎప్పుడూ తల్లిదండ్రులతో చెబుతూ ఉద్యోగాన్వేషణలో ఉంటూ.. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మండల కేంద్రం లేపాక్షిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీకి చెందిన టిప్పు కుమారుడు అబ్రార్‌(22) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గురువారం తోటి మిత్రులు అయాజ్‌, యూనస్‌లతో కలిసి ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. వీరు పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. చిలమత్తూరు మండలం పాతచామలపల్లికి చెందిన రాజారెడ్డి అక్కడ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకుని అటువైపుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సును గమనించకుండా ప్రధాన రహదారిపైకి వచ్చాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్‌ రాజారెడ్డి ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న అబ్రార్‌ ద్విచక్ర వాహనాన్ని ముందు చక్రాల వద్ద ఢీకొనగా, రాజారెడ్డి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు ఢీ కొన్నాడు. ప్రమాదంలో అబ్రార్‌ బస్సు ముందు చక్రాల కింద చిక్కి నుజ్జునుజ్జవగా, అయాజ్‌, యూనస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. రాజారెడ్డికి రెండు కాళ్లకు, తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రాజారెడ్డికి మెరుగైన చికిత్సకు బెంగళూరుకు తరలించారు. బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని