logo

ఉద్యోగాల పేరిట మోసం.. ఐదుగురు అరెస్ట

తపాలా శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఘటనలో గురువారం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు గుంతకల్లు రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు తెలిపారు. సీఐ వివరాల మేరకు..

Published : 20 May 2022 03:25 IST

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: తపాలా శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఘటనలో గురువారం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు గుంతకల్లు రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు తెలిపారు. సీఐ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ బద్రి, రాకెట్ల మస్తాన్‌, బోయ సతీష్‌, బోయ నరేష్‌, బోయ లక్ష్మీ రైల్వే శాఖలో పని చేస్తున్న మహబూబ్‌బాషా అనే వ్యక్తిని కలసి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 2019లో రూ.57లక్షలు తీసుకున్నారు. సతీష్‌ అనే వ్యక్తి నెట్‌లో ఉండే శాలరీ స్లిప్పులు, బ్యాంక్‌ ఖాతాలను మార్పు చేసి, వాటిని బాధితులకు చూపించి నమ్మించేవాడు. తపాలా శాఖ పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి తన తమ్ముడు నరేష్‌, అమ్మ లక్ష్మి, బంధువు రాకెట్ల మస్తాన్‌, బాబాయి బద్రితో కలసి బాధితుల వద్ద రూ.57లక్షలు వసూలు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితుడు మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని