logo

చంద్రబాబు పర్యటనతో ఉత్సాహం

చంద్రబాబు పర్యటనతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి దిగిపోవాలని యువత, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నార

Published : 22 May 2022 04:33 IST

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: చంద్రబాబు పర్యటనతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి దిగిపోవాలని యువత, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మార్పు వచ్చిందని మళ్లీ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. పర్యటన దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా చూపిన ఉత్సాహం ఎన్నికల వరకు కొనసాగిద్దామని కార్యకర్తలు, నేతలకు మాజీ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. రాప్తాడు, చెన్నేకొత్తపల్లిలో వేలాది మంది తరలివచ్చి అభిమానాన్ని చాటారన్నారు. ఎక్కువ మందితో సభ్యత్వం చేయించడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ఎన్నాళ్లిలా పాలన సాగిస్తారు?

పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నాళ్లు పాలన సాగిస్తారని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. అనంతపురంలో గృహ నిర్భంధంలో ఉన్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును శనివారం రాత్రి ఆయన పరామర్శించారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా తెదేపా నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించబోమన్నారు. తప్పు జరగకపోతే కాలవ రాయదుర్గం వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వైకాపాపై వ్యతిరేకత మొదలైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని