logo

ప్రమాదాల నివారణకు నిర్మాణాత్మక చర్యలు

జిల్లాలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రమాదాలను అరికట్టేందుకు శ్రద్ధ పెట్టాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్సు

Published : 22 May 2022 04:33 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

 

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రమాదాలను అరికట్టేందుకు శ్రద్ధ పెట్టాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్సు హాలులో జిల్లా రహదారుల భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రహదారులపై గుంతలను పూడ్చాలని, వాటి మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారులపై రాత్రివేళ స్పష్టంగా కనిపించడానికి రెస్టింగ్‌ ప్లేసులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐరాడ్‌ యాప్‌ ద్వారా అనుబంధ శాఖలు రోడ్డుపై ప్రమాదాల వివరాలను ఎప్పటికపుడు నమోదు చేయాలన్నారు. గుత్తి, కళ్యాణదుర్గం రోడ్లపై ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని నియంత్రించాలని, ట్రామా కేర్‌ ఆస్పత్రులకు తగిన ప్రతిపాదనలు పంపాలన్నారు. సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌ విభాగాన్ని, ఓపీ సేవలను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో డీటీసీ శివరామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఓబుళరెడ్డి, డీఈఓ శామ్యూల్‌, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, డీఎంహెచ్‌ఓ విశ్వనాథయ్య, డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని