logo

సామాజిక న్యాయభేరి 29న

జిల్లాలో ఈనెల 29న సామాజిక న్యాయభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైకాపా జిల్లా అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బీసీ మంత్రులు చేపట్టిన బస్సుయా

Published : 22 May 2022 04:33 IST

గడియారం కూడలిలో స్థల పరిశీలన చేస్తున్న రఘురాం, మంత్రి ఉషశ్రీ చరణ్‌ తదితరులు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: జిల్లాలో ఈనెల 29న సామాజిక న్యాయభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైకాపా జిల్లా అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బీసీ మంత్రులు చేపట్టిన బస్సుయాత్ర 29న జిల్లా కేంద్రానికి చేరుకుంటుందన్నారు. ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు బహిరంగసభ ఉంటుందని పేర్కొన్నారు. యాత్ర గోడ ప్రతులను కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి శంకరనారాయణతో కలసి విడుదల చేశారు.

వైకాపా మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయబేరి బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ రఘురాం అన్నారు. శనివారం ఆయన వైకాపా కార్యాలయంలో మంత్రి ఉష, పార్టీ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి, శంకరనారాయణ, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌ తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం నగరంలో బహిరంగ సభ నిర్వహణకు గడియారం కూడలిలో స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఎస్పీ ఫక్కీరప్పతో చర్చించారు.

అణగారిన వర్గాలకు న్యాయమేదీ?

సామాజిక న్యాయభేరి కార్యక్రమం కోసం నిర్వహించిన సమన్వయ సమావేశంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆర్టీసీ జోనల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ హరిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశానికి తమను ఆహ్వానించలేదని వారు పేర్కొన్నారు. మరో మహిళా నాయకురాలు కృష్ణవేణి తమకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని