logo

అక్రమ తవ్వకాలపై విజిలెన్స్‌ తనిఖీలు

మండలంలోని కొండుపల్లి సమీపంలో ఉన్న భూగర్భ గనుల్లో యజమానులు అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని తెలిసి శనివారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, భూగర్భ గనులశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆరుగురికి చెందిన భూగర్భ గనుల్లో ఏజీ శివప్రసా

Published : 22 May 2022 04:33 IST

కొలతలు వేస్తున్న అధికారులు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: మండలంలోని కొండుపల్లి సమీపంలో ఉన్న భూగర్భ గనుల్లో యజమానులు అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని తెలిసి శనివారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, భూగర్భ గనులశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆరుగురికి చెందిన భూగర్భ గనుల్లో ఏజీ శివప్రసాద్‌, సీఐ సాయిప్రసాద్‌, భూగర్భగనులశాఖ ఏడీ నాగయ్య, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ కవిత, సర్వేయర్‌ నిర్మల తనిఖీలు చేశారు. ఎంత మేరకు తవ్వకాలు జరిపారు అనే అంశాలపై కొలతలు వేశారు. గనుల యజమానులకు ఇచ్చిన మేరకు తవ్వకాలు జరిపారా? లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టిన అనంతరం నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. వారి వెంట రెవెన్యూ ఆర్‌ఐ షేక్షావలి, వీఆర్వో రాజేష్‌, వీఆర్‌ఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని