logo

దేవరింటిపల్లిలో సంబరాలు

ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ టీవీ షో విజేతగా హీరోయిన్‌ బిందుమాధవి నిలిచింది. ఆమె తండ్రి భాస్కర్‌రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవరింటిపల్లికి చెందినవారు. డీసీటీవోగా పదవీ విరమణ చేశారు. తల్లి నిర్మల గృహిణి. అయితే బిందుమాధవి ఆమె తండ్రి

Published : 22 May 2022 04:46 IST


బిగ్‌బాస్‌ జ్ఞాపిక, తల్లిదండ్రులు నిర్మల, భాస్కర్‌రెడ్డితో బిందుమాధవి

నల్లచెరువు, న్యూస్‌టుడే: ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ టీవీ షో విజేతగా హీరోయిన్‌ బిందుమాధవి నిలిచింది. ఆమె తండ్రి భాస్కర్‌రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవరింటిపల్లికి చెందినవారు. డీసీటీవోగా పదవీ విరమణ చేశారు. తల్లి నిర్మల గృహిణి. అయితే బిందుమాధవి ఆమె తండ్రి మదనపల్లిలో ఉద్యోగం చేసే సమయంలో జన్మించారు. బిగ్‌బాస్‌ ఓటీటీ వెర్షన్‌లో విజేతగా నిలిచినట్లు సమాచారం రావడంతో శనివారం సాయంత్రం దేవరింటిపల్లిలో కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో బిందుమాధవి సంబరాలు చేసుకున్నట్లు ఆమె తండ్రి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని