logo

‘బస్సు యాత్ర పోయి.. రైలు యాత్ర వస్తుంది’

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పూర్తిగా ఫెయిల్‌ అయ్యిందని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం అనంతపురంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైకాపా మంత్రులు చేపట్టే బస్సు యాత్రను ప్రజలు అడ్డుకొనే పరిస్థితి ఉంద

Updated : 23 May 2022 06:04 IST


మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం(రాణినగర్‌), న్యూస్‌టుడే: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పూర్తిగా ఫెయిల్‌ అయ్యిందని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం అనంతపురంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైకాపా మంత్రులు చేపట్టే బస్సు యాత్రను ప్రజలు అడ్డుకొనే పరిస్థితి ఉందని, బస్సు మీద ప్రజలు రాళ్లు వేస్తారని.. నాయకులు పోలీసులను పెట్టుకొని వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. పోలీసులు అనే మహా వృక్షం కింద వారు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. బస్సు యాత్ర పోయి ఈసారికి రైలు యాత్ర చేసుకోవాల్సిందేనని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. రాయదుర్గంలో సంప్రదాయం పాటించడం లేదని ప్రశ్నించినందుకు కాలవ శ్రీనివాసులును గృహనిర్బంధం చేయడం తగదన్నారు. ఆయన రాయదుర్గం వెళుతుంటే అడ్డుకోవడం మంచిది కాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని