logo

మాన్యువల్‌ దస్త్రాలు వెనక్కి పంపిస్తా

‘మాన్యువల్‌గా దస్త్రాలు పంపొద్ధు ప్రతి ఒక్క శాఖ ఇక నుంచి పూర్తి స్థాయిలో ఈ-దస్త్రాలనే పంపించాలి. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే డీఐసీ వద్ద చూసుకోండి’ అని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో జిల్లా స్థాయి

Published : 24 May 2022 06:00 IST

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘మాన్యువల్‌గా దస్త్రాలు పంపొద్ధు ప్రతి ఒక్క శాఖ ఇక నుంచి పూర్తి స్థాయిలో ఈ-దస్త్రాలనే పంపించాలి. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే డీఐసీ వద్ద చూసుకోండి’ అని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమం జరిగింది. జేసీ కేతన్‌ గార్గ్‌, ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ శ్రీనివాసులు, ఆన్‌సెట్‌ సీఈఓ కేశవనాయుడు, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన్‌ తదితరులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి బాధితుల అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొత్తం 291 వినతులు వచ్చాయి. ఈ ప్రక్రియ తర్వాత కలెక్టర్‌ జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక నుంచి ప్రతి సమస్య అర్జీదారుడి సమక్షంలో పరిష్కారం చేయాలి. ఎందుకు చేయలేదో వారికి వివరంగా తెలపాలని సూచించారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, తెదేపా క్రిష్టియన్‌ మైనార్టీ సంఘాల సారథ్యంలో పలు సమస్యలపై వినతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని