logo

అట్టహాసంగా జాతీయ కబడ్డీ పోటీలు

తాడిపత్రి పురపాలికలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జేసీ నాగిరెడ్డి మెమోరియల్‌ జాతీయ మహిళా కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన 14 జట్లను జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు

Published : 24 May 2022 06:00 IST

తలపడుతున్న రాజస్థాన్‌, పంజాబ్‌ జట్లు

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి పురపాలికలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జేసీ నాగిరెడ్డి మెమోరియల్‌ జాతీయ మహిళా కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన 14 జట్లను జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజస్థాన్‌, పంజాబ్‌ జట్లు తలబడగా రాజస్థాన్‌ జట్టు ఘన విజయం సాధించింది. జేఎంసీ హరియాణా, పుణే జట్లు తలపడగా హరియాణా జట్టు విజయం సాధించింది. ఇంకా పలు జట్ల మధ్య పోటీలు జరిగాయి. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. తనకు ఆటలంటే చాలా ఇష్టమని చెప్పారు. క్రీడల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని, ప్రతి విద్యార్థి ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆయన సూచించారు. కరోనా మహమ్మారి రెండు దఫాలుగా రావడంతో క్రీడాకారులు ఆటలకు దూరమయ్యారన్నారు. వేసవిలో విద్యార్థులకు ఆటల పట్ల ఆసక్తి కల్పించేందుకే ఈ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు జేసీ అస్మిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని