logo

అంగన్‌వాడీ అటుకులు పాతవే

బూజుపట్టి.. ముద్దగా మారిన అటుకులు పాతవేనని తేలింది. 2021 సెప్టెంబరు నాటికే గడువు తీరింది. కానీ, ఓ బాలింత ఇంట్లో మూలన పడేసి... తాజాగా బయటకు తీసి తెరిచి చూడటంతో బూజుపట్టిన వైనం వెలుగు చూసింది. మొత్తమీ తతంగంపై

Published : 24 May 2022 06:00 IST

మహిళలతో విచారిస్తున్న సీడీపీఓ లలిత, సూపర్‌వైజర్‌ త్రివేణి

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: బూజుపట్టి.. ముద్దగా మారిన అటుకులు పాతవేనని తేలింది. 2021 సెప్టెంబరు నాటికే గడువు తీరింది. కానీ, ఓ బాలింత ఇంట్లో మూలన పడేసి... తాజాగా బయటకు తీసి తెరిచి చూడటంతో బూజుపట్టిన వైనం వెలుగు చూసింది. మొత్తమీ తతంగంపై ఐసీడీఎస్‌ అనంత ప్రాజెక్టు సీడీపీఓ లలిత సారథ్యంలో క్షేత్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా పైవిషయం తేలింది. ‘అనంతలో బూజుపట్టిన అటుకులు’ అన్న కథనాన్ని సోమవారం ‘ఈనాడు’ ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన సీడీపీఓ లలిత అనంత నగరం బిందెలకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులైన మహిళలను పిలిపించి విచారించారు. ఈ కేంద్రంలో మొత్తం 38 మంది ఉంటే 31 మందిని పిలిపించి... వారికి ఇచ్చిన అటుకుల ప్యాకెట్లను కూడా తెరిచి చూశారు. వీటికి జులై 6వ తేదీ దాకా గడువు ఉంది. అయితే బూజుపట్టిన అటుకుల ప్యాకెట్‌ మాత్రం పాతదేనని తేలింది. సెప్టెంబరు 18న తయారీ చేసినట్లు ఆ ప్యాకెట్‌పై ఉంది. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ త్రివేణి, కార్పొరేటర్‌ నాగమణి, ఎంఎస్‌కే మానస తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని