logo

తెదేపా సానుభూతిపరుడి ఇంటి ప్రహరీ తొలగింపు

మండలంలోని మేడాపురం గ్రామంలో తెదేపా సానుభూతిపరుడి ఇంటి ప్రహరీని పంచాయతీ అధికారులు సోమవారం తొలగించారు. బాధితులు బాద్రుసాహెబ్‌ భార్య జహారాణి మాట్లాడుతూ గ్రామంలోని బైరవ నగర్‌లో కొన్నేళ్ల కిందట ఇల్లు, ప్రహరీ నిర్మించామన్నారు.

Published : 24 May 2022 06:00 IST

తొలగించిన ప్రహరీ వద్ద బాధితురాలు జహారాణి

మేడాపురం (చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: మండలంలోని మేడాపురం గ్రామంలో తెదేపా సానుభూతిపరుడి ఇంటి ప్రహరీని పంచాయతీ అధికారులు సోమవారం తొలగించారు. బాధితులు బాద్రుసాహెబ్‌ భార్య జహారాణి మాట్లాడుతూ గ్రామంలోని బైరవ నగర్‌లో కొన్నేళ్ల కిందట ఇల్లు, ప్రహరీ నిర్మించామన్నారు. అప్పటి నుంచి అక్రమంగా కనపడని ప్రహరీ నేడు అక్రమకట్టడంగా ఎలా కనిపించిందని ప్రశ్నించారు. తెదేపా సానుభూతిపరులమని.. రాజకీయ కక్ష సాధింపు, అక్కసుతోనే సోమవారం ఇంటి ప్రహరీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ తొలగింపు విషయాన్ని పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా గ్రామకంఠం భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించారన్నారు. మూడు సార్లు తాఖీదులు పంపినా స్పందించకపోవడంతో తొలగించామని పేర్కొన్నారు. తెదేపా మండల కన్వీనర్‌ ముత్యాలరెడ్డి, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఓబిలేసు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అమరేంద్ర మాట్లాడుతూ అధికార దర్పంతోనే తెదేపా సానుభూతిపరుడి ప్రహరీ తొలగించారని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని