logo

రూ.60కి కిలో టమోటా

మార్కెట్లో టమోటా ధరలు కిలో రూ.80-100 పలుకుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో మార్కెటింగ్‌శాఖ రంగంలోకి దిగింది. కాస్త ధర తగ్గించి, విక్రయించాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు పరమేశ్వరన్‌ తెలిపారు. కర్ణాటకలోని

Published : 25 May 2022 04:49 IST

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: మార్కెట్లో టమోటా ధరలు కిలో రూ.80-100 పలుకుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో మార్కెటింగ్‌శాఖ రంగంలోకి దిగింది. కాస్త ధర తగ్గించి, విక్రయించాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు పరమేశ్వరన్‌ తెలిపారు. కర్ణాటకలోని కోలార్‌ మార్కెట్‌ నుంచి సాహు అనే మేలు రకం టమోటాను 12 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు తెప్పించినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం నుంచి అనంతపురం ఎన్‌టీఆర్‌ రైతుబజారుతోపాటు అనంతపురం, తాడిపత్రి వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో సిబ్బంది ద్వారా కిలో రూ.60 చొప్పున విక్రయిస్తామని ఆయన తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని