logo

ఇంటింటా చెత్తసేకరణ చేయాల్సిందే

జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్తసేకరణ జరగాల్సిందేనని డీపీఓ ప్రభాకర్‌రావు ఆదేశించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం డీపీఆర్‌సీ హాలులో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై అనంతపురం డివి

Published : 25 May 2022 04:49 IST

తపోవనం(అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్తసేకరణ జరగాల్సిందేనని డీపీఓ ప్రభాకర్‌రావు ఆదేశించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం డీపీఆర్‌సీ హాలులో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై అనంతపురం డివిజన్‌ పరిధిలోని మండలాల ఈఓఆర్డీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రీసోర్స్‌ పర్సన్లకు సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించి ఎరువు తయారు చేయాలని సూచించారు. మురుగు కాలువలు శుభ్రం చేసి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం ఆరంభం కావడంతో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. నీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో డీఎల్‌పీఓ నాగరాజు, డీపీఓ కార్యాలయ ఏఓ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు