logo

తెదేపా కార్యకర్తలపై వేటకొడవళ్లతో దాడి

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో మరోసారి వర్గకక్షలు బుసకొట్టాయి. ఇద్దరు తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం... ఇరువర్గాల మధ్య ఉన్న పాతకక్షల కారణంగా

Updated : 25 May 2022 10:22 IST


చికిత్సపొందుతున్న రవి

హిందూపురం పట్టణం, చిలమత్తూరు, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో మరోసారి వర్గకక్షలు బుసకొట్టాయి. ఇద్దరు తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం... ఇరువర్గాల మధ్య ఉన్న పాతకక్షల కారణంగా మంగళవారం నాడు జాతర రోజున మరోసారి వివాదం రేగింది. తెదేపా నాయకులు సాయంత్రం గ్రామంలోకి వెళ్తుండగా రోడ్డులో దుకాణం వద్ద ఉన్న వైకాపా కార్యకర్త కోతుల రమేష్‌ వారివైపు కవ్వింపుగా చూశాడు. ఎందుకు అలా చూస్తున్నావు.. నీకేమైనా మా ప్రభుత్వంలో నష్టం జరిగిందా అని తెదేపా నాయకుడు బాలాజీ అడిగి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే రమేష్‌ తన వర్గీయులతో వచ్చి బాలాజీ ఇంటి మీదకు రాళ్లతో దాడి చేశాడు. వేటకొడవళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు భయపడి తలుపులు వేసుకున్నారు. సమీపంలో కనిపించిన తెదేపా కార్యకర్తలు నరసింహమూర్తి రవిపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామవీధుల్లో తిరుగుతూ భయాందోళన సృష్టించారు. అదే సమయంలో రమేష్‌ వర్గీయులు ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని వారూ ఆసుపత్రికి రావడం గమనార్హం. గాయపడిన తెదేపా కార్యకర్తలను ముందుగా చిలమత్తూరు ప్రభుత్వాసుపత్రికి.. అక్కడ నుంచి హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోసారి అల్లర్లు జరగకుండా పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. తెదేపా మండల నాయకులు రాత్రి చిలమత్తూరు ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. ఇన్‌ఛార్జి ఎస్సై మునీర్‌అహ్మద్‌ తమ సిబ్బందితో అక్కడ చేరుకుని తెదేపా నాయకులకు సర్దిచెప్పారు.

నరసింహమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు