logo

ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు

ప్రయాణికులు అంత గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా పెద్దశబ్దం వినిపించింది. అంతా తెరుకునే చూసేలోపు లారీని బస్సు వెనుకవైపు నుంచి ఢీకొంది.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మృతి చెందగా.. 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇన్‌ఛార్జి ఎస్సై మునీర్‌అహ్మద్‌, ప్రయాణికుల

Updated : 25 May 2022 04:56 IST

డ్రైవర్‌ దుర్మరణం: 15 మందికి గాయాలు


ఘటనా స్థలంలో లారీ, బస్సు

చిలమత్తూరు, న్యూస్‌టుడే: ప్రయాణికులు అంత గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా పెద్దశబ్దం వినిపించింది. అంతా తెరుకునే చూసేలోపు లారీని బస్సు వెనుకవైపు నుంచి ఢీకొంది.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ మృతి చెందగా.. 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇన్‌ఛార్జి ఎస్సై మునీర్‌అహ్మద్‌, ప్రయాణికుల కథనం ప్రకారం... రాయచూరు నుంచి 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు సోమవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరింది. తాడిపత్రి నుంచి బెంగళూరుకు సిమెంట్‌లోడ్‌తో బయలుదేరిన ఓ లారీ కోడూరుతోపు సమీపంలో రాగానే డీజిల్‌ అయిపోవడంతో జాతీయ రహదారిపై డ్రైవర్‌ నిలిపివేశాడు. లారీ డ్రైవర్‌ కనీస నిబంధనలు పాటించలేదు. లారీ వెనుకభాగంలో ఇండికేటర్లు కనిపించకుండా టార్పాలిన్‌ కప్పిఉంది. మరి కొన్నిగంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉండగా.. నిద్ర సమయం కావడంతో మంగళవారం తెల్లవారు జామున అగిఉన్న లారీ వెనుక వైపున బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన బస్సు డ్రైవర్‌ జీయావుల్ల్లా (38) అర్ధగంటపాటు ప్రాణాలతో పోరాడి చివరకు మృతిచెందాడు. బస్సులో ఇరుక్కున్న ఆయన్ని బతికించడానికి స్థానికులు, పోలీసులు విఫలయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు అంబులెన్స్‌ల్లో కొంత మంది క్షతగాత్రులను బాగేపల్లి, మరి కొంత మందిని హిందూపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. 15 మంది ప్రయాణికులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో వినుకొండకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు దేదీప్యరెడ్డి, ఆదిలక్ష్మి, వెంకటకృష్ణారెడ్డి, కుశల ఈశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఘటనా స్థలానికి క్రైన్‌ ఆలస్యంగా వచ్చింది. దాదాపు రెండు గంటలు శ్రమించి బస్సు, లారీలను వేరుచేశారు. జాతీయ రహదారిపై ఇంత పెద్ద ప్రమాదం జరిగితే క్రైన్‌ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. వాహనాలను సమీపంలోని రహదారికి మళ్లించారు.

జీయవుల్లా (పాతచిత్రం)

క్షతగాత్రులు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు