logo

జగన్‌ ఏకపక్ష వైఖరే.. ఉద్రిక్తతలకు కారణం

ముఖ్యమంత్రి జగన్‌ ఏకపక్ష వైఖరితో రాష్ట్రంలో ఆందోళనలు, దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. అనంతపురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు

Published : 26 May 2022 03:53 IST


మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అనంతపురం ఆజాద్‌నగర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ ఏకపక్ష వైఖరితో రాష్ట్రంలో ఆందోళనలు, దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. అనంతపురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టే అంశంలో స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకపోవడమే ఉద్రిక్తతలకు కారణమని చెప్పారు. ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉన్నట్లు.. ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా, ఎవరినీ సంప్రదించకుండా, ఆన్‌లైన్‌ అప్రూవల్‌ను ఆధారం చేసుకుని జిల్లాలు విభజించడం, పేరు పెట్టడంతో ఆందోళనలకు దారి తీసిందన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే డ్రైవర్‌ను కొట్టి, చంపి కారులో ఇంటికి తీసుకెళ్లే స్థాయికి వెళ్లారంటే.. రాష్ట్రంలో చట్టాలు పని చేస్తున్నాయా ?అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. 
ఆ నలుగురు చేతిలోనే అధికారాలు
రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రులంతా వందశాతం డమ్మీలని రామకృష్ణ విమర్శించారు. అధికారాలన్నీ సజ్జల, విజయసాయి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి చేతుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. హోంమంత్రి కనీసం ఓ ఎస్సైని బదిలీ చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. దళితులు, పేదలపై దాడులు జరుగుతుంటే ఏ ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేస్తారని అడిగారు. దావోస్‌ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పెట్టుబడిదారుల నుంచి చుక్కెదురైందని విమర్శించారు. దళితులు, మహిళలు, బడుగులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టడానికి జూన్‌ 2న ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని