logo
Published : 26 May 2022 03:53 IST

మూడేళ్లలో చేసిందేమిటి?


ఎమ్మెల్యే శంకరనారాయణకు సమస్యలు విన్నవిస్తున్న గ్రామస్థులు

పరిగి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. తమ గ్రామంలో సమస్యలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని పరిగి మండలం చెర్లోపల్లి, పుట్టగూర్లపల్లి గ్రామ మహిళలు, యువత ఎమ్మెల్యే శంకరనారాయణను నిలదీశారు. బుధవారం ఆ రెండు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత చెర్లోపల్లి వెళ్లిన శంకరనారాయణకు గ్రామస్థులు సమస్యల ఏకరవు పెట్టారు. ‘మీరు గెలిచి మూడేళ్లు అయింది. ఇప్పుడు వచ్చారు. మా కాలనీలో నీళ్లు సక్రమంగా రావడం లేదు. డ్రైనేజీలు, రహదారులు, అంగన్‌వాడీ కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, యువత ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. గœత ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని, ఎదురు ప్రశ్న వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో అందరూ ఓట్లు వేశామని.. గ్రామ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని యువత పట్టుబట్టారు. యువత పట్టు వీడకపోవడంతో ఎస్‌ఐ శ్రీనివాసులు నచ్చజెప్పారు. 

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని