logo

విద్యుత్తు కోతలు.. ప్రజలకు వెతలు

విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో సమస్య తలెత్తడటంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యవసర కోతలను ఆశాఖ అధికారులు అమలు చేశారు. చీకట్లు నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు

Published : 26 May 2022 03:53 IST

అనంత(విద్యుత్తు), న్యూస్‌టుడే: విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో సమస్య తలెత్తడటంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యవసర కోతలను ఆశాఖ అధికారులు అమలు చేశారు. చీకట్లు నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేసవి కావడం పైగా విద్యుత్తు కోతతో ఉక్కపోతను భరించలేకపోయారు. బుధవారం రాత్రి 6 గంటల నుంచి వ్యవసాయ సర్వీసులతో పాటు, జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రొటేషన్‌ పద్ధతిలో కొన్ని గంటల పాటు సరఫరాను నిలిపివేశారు. తాడిపత్రి, రాయదుర్గం, అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, కళ్యాణదుర్గం, హిందూపురం తదితర ప్రాంతాల్లో సరఫరాను నిలిపివేశారు. పలు మండలాల్లో అర్ధరాత్రి వరకు సరఫరా ఇవ్వలేదు. ముందస్తు సమాచారం లేకుండా సరఫరా నిలిపి వేయటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు కార్యాలయాలకు ఫోన్‌ చేసినా స్పందన లేదని విమర్శించారు. కొందరు వినియోగదారులు విద్యుత్తు ఉపకేంద్రాల వద్దకు వెళ్లి     కరెంటు ఎప్పుడు వస్తుందో చెప్పాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని