logo

కోట్ల భవనం.. నిరుపయోగం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు దుస్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించి తద్వారా స్వయం ఉపాధికి, పట్టణంలో పరిశ్రమ అభివృద్ధికి నిర్మించిన సాధారణ సదుపాయాల కేంద్రం(సీఎఫ్‌సీ) నాలుగైదేళ్లుగా నిరుపయోగంగా మారింది. వెలుగు, డీఆర్‌డీఏ అధికారులు

Published : 26 May 2022 03:53 IST


మూతపడిన సీఎఫ్‌సీ భవనం

రాయదుర్గం, న్యూస్‌టుడే: గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు దుస్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించి తద్వారా స్వయం ఉపాధికి, పట్టణంలో పరిశ్రమ అభివృద్ధికి నిర్మించిన సాధారణ సదుపాయాల కేంద్రం(సీఎఫ్‌సీ) నాలుగైదేళ్లుగా నిరుపయోగంగా మారింది. వెలుగు, డీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోకపోవటంతో రూ.1.50 కోట్లతో నిర్మించిన భవనం, రూ.40 లక్షల విలువైన 120 అధునాతన జూకీ కుట్టుయంత్రాలు వృథాగా ఉన్నాయి. వెలుగు ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది మహిళలకు దుస్తుల తయారీలో నైపుణ్యం పెంచి వారి ఆధ్వర్యంలోనే సీఎఫ్‌సీని స్వతంత్రంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాటు చేశారు. 
నెరవేరని లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లతో దుస్తులు తయారుచేసి దేశంలోని ప్రముఖ కంపెనీలకు ఎగుమతి చేయటం ద్వారా మార్కెట్‌ సౌకర్యాన్ని వృద్ధి చేసి తద్వారా కంపెనీ నిర్వహణను మ్యాక్స్‌ సొసైటీకి అప్పగించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఆరంభంలో సీఎఫ్‌సీ నిర్వహణను నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఇచ్చినా కార్యరూపం దాల్చ లేదు. మధ్యలో బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు, టాటా సంస్థకు బాధ్యతలు అప్పగించినా మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. స్థానికులు ఆసక్తి చూపినా తక్కువ బాడుగ అడుగుతున్నారనే ఉద్దేశ్యంతో అధికారులు ముందడుగు వేయలేదు. 
త్వరలో ప్రారంభానికి చర్యలు.. 
సీఎఫ్‌సీ నిర్వహణకు ప్రైవేటు వ్యాపారులు ముందుకొస్తున్నారు. నెలకు ప్రభుత్వం రూ.50 వేలు నిర్ణయించగా ప్రైవేటు వ్యాపారులు రూ.30 వేలు చొప్పున బాడుగ ఇవ్వటానికి ముందుకొస్తున్నారు.చర్చలు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
-గంగాధర, వెలుగు ప్రాంతీయ సమన్వయ అధికారి, రాయదుర్గం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని