logo

రికార్డుల నిర్వహణ మెరుగుపరచుకోండి

క్రైమ్‌ అగనెస్ట్‌ ఉమెన్‌ ఘటనల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ఎం.రవిప్రకాష్‌ ఆదేశించారు. అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్లు, పరిసరాలు, రికార్డుల నిర్వహణ, పనితీరును పరిశీలించారు.

Published : 26 May 2022 03:53 IST


రికార్డులను పరిశీలిస్తున్న డీఐజీ రవిప్రకాష్‌

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: క్రైమ్‌ అగనెస్ట్‌ ఉమెన్‌ ఘటనల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ఎం.రవిప్రకాష్‌ ఆదేశించారు. అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్లు, పరిసరాలు, రికార్డుల నిర్వహణ, పనితీరును పరిశీలించారు. రికార్డుల నిర్వహణ మెరుగు పరుచుకోవాలని సూచించారు. పోక్సో, అత్యాచారం కేసులను సమీక్షించారు. ప్రత్యేకంగా నాలుగు అత్యాచారం కేసులను త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులుకు అప్పగించారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న మోసాలపై సూచనలు చేశారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా, జవాబుదారీగా వ్యవహరిస్తూ.. సమస్యను 15రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. క్రమశిక్షణారహితంగా సిబ్బంది వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఐజీతో పాటు డీఎస్పీ ఆర్లశ్రీనివాసులు, సీఐ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని