logo

సేవా కార్యక్రమాలు విస్తృతం చేద్దాం

సత్యసాయి మానవ సేవయే.. మాధవసేవని ప్రపంచానికే చాటిచెప్ఫి. మానవాళిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్ఫి. సేవామార్గం వైపు పయనింపజేశారని, దేశీయంగా ప్రతి మారుమూల ప్రాంతాలకు సాయి సేవలు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సాయి దేశీయ సంస్థల అధ్యక్షు

Published : 27 Jun 2022 06:02 IST

ముగిసిన సత్యసాయి సాధన సమితి సదస్సు

సదస్సులో ట్రస్టు ట్రస్టీ రత్నాకర్‌, సభ్యులు, సేవాసంస్థల ప్రతినిధులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి మానవ సేవయే.. మాధవసేవని ప్రపంచానికే చాటిచెప్ఫి. మానవాళిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మికతను మేల్కొల్ఫి. సేవామార్గం వైపు పయనింపజేశారని, దేశీయంగా ప్రతి మారుమూల ప్రాంతాలకు సాయి సేవలు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సాయి దేశీయ సంస్థల అధ్యక్షుడు నిమీష్‌పాండే పిలుపునిచ్చారు. సాయికుల్వంత్‌ మందిరంలో మూడ్రోరోజులు జరిగిన అఖిల భారత సత్యసాయి సేవాసంస్థల సాధన సదస్సు ఆదివారం ముగిసింది. పలువురు వక్తలు సదస్సులో పాల్గొన్న మూడు వేలాదిమంది సాయిసంస్థల కన్వీనర్లకు దిశ, నిర్దేశం చేశారు. ప్రతి మనిషి సేవ, ప్రేమ, భావనను పెంపొందించుకొని సమ సమాజస్థాపనకు కృషి చేయాలని.. అదే సత్యసాయి అభిమతని, సేవా కార్యక్రమాలను బాధ్యతగా తీసుకోవాలన్నారు. కన్వీనర్లకు సత్యసాయి ట్రస్టు ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ వస్త్రాలు, తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అభినందించారు. వేలాదిమంది కన్వీనర్లు మహాసమాధిని బారులుతీరి దర్శించుకున్నారు. ఈ సదస్సులో సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ చక్రవర్తి, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని