logo

దుల్హన్‌కు పైసా ఇచ్చారా?

తెదేపా పాలనలో దుల్హన్‌ పథకం ద్వారా రూ.50 వేలు ఇస్తే.. వైకాపా అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తానని నమ్మబలికి మూడేళ్లలో పైసా ఇవ్వలేదని తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన్‌ పేర్కొన్నారు. దుల్హన్‌ పథకం సొమ్ము చెల్లించాలని కోరుతూ ఆ

Published : 27 Jun 2022 06:02 IST

ప్రదర్శన చేస్తున్న తెదేపా రాష్ట్ర మైనార్తీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన్‌, మహిళలు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: తెదేపా పాలనలో దుల్హన్‌ పథకం ద్వారా రూ.50 వేలు ఇస్తే.. వైకాపా అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తానని నమ్మబలికి మూడేళ్లలో పైసా ఇవ్వలేదని తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన్‌ పేర్కొన్నారు. దుల్హన్‌ పథకం సొమ్ము చెల్లించాలని కోరుతూ ఆదివారం అనంతపురం సప్తగిరి సర్కిల్‌ కూడలి వద్ద ముస్లిం మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లింలు తమ పిల్లల పెళ్లికి భారం కాకూడదనే ఉద్దేశంతో తెదేపా హయాంలో ఐదేళ్లుగా వివాహ సమయానికే సొమ్ము అందించే వారని పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా రూ.లక్ష ఇస్తానని వైకాపా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముస్లింలను మోసం చేసిందని దుయ్యబట్టారు. విదేశీ విద్య కోసం రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు తెదేపా ప్రభుత్వం అందజేసిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా మాయమాటలు చెబుతున్నారని ముస్లింలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని