logo

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

లోక్‌ అదాలత్‌తో సులభంగా సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 27 Jun 2022 06:02 IST


మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: లోక్‌ అదాలత్‌తో సులభంగా సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులతో పాటు, అన్ని సివిల్‌, మోటారు ప్రమాద, పరిహార కేసులు, కార్మికుల పరిహార కేసులు, కుటుంబ తగాదాలు, లేబర్‌ కోర్టు, చిట్‌ఫండ్‌ కంపెనీ, చెక్‌బౌన్సు కేసులను లోక్‌ అదాలత్‌తో పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలోని 25 బెంచీలలో ఆదివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,711 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. ఇందులో రాజీ పడదగిన 6,370 క్రిమినల్‌, 84 సివిల్‌, 3,209 ప్రీలిటిగేషన్‌, 48 మోటారు వాహనాల ప్రమాద పరిహార కేసులకు పరిష్కారం చూపారు. ప్రమాదభరిత కేసులలో కక్షిదారులకు రాజీమార్గంలో రూ.3,43,95,000 పరిహారంగా ఇప్పించారు. చెక్‌బౌన్స్‌ కేసుల్లో రూ.69,69,311, సివిల్‌లో రూ.44,58,000, ప్రీలిటిగేషన్‌ కేసుల్లో రూ.75,96,335, రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులలో రూ.33,93,350 కక్షిదారులకు రాజీమార్గంలో ఇప్పించారు. లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఎస్పీ ఫక్కీరప్ప, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి గరికపాటి దీనబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు