logo
Published : 27 Jun 2022 06:02 IST

ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌కు షోకాజ్‌ నోటీసులు?

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ఈనెల 14న అనంతపురం పోలీసు జిల్లా కార్యాలయంలో ‘సేవ్‌ ఏపీ పోలీస్‌’ నినాదంతో నిరసన తెలిపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌కు రెండ్రోజుల కిందట ఉన్నతాధికారులు సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. నిరసన ఘటనపై ఓ సీఐ, ఓ ఏఎస్పీ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి రిపోర్టు పంపినట్లు సమాచారం. ఈ రిపోర్టును అనుసరించి సదరు అధికారి.. కానిస్టేబుల్‌కు సంజాయిషీ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. క్రమశిక్షణను ఉల్లంఘించి అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలపడం నేరమని అందులో పేర్కొన్నారు. అలాగే గతంలో కానిస్టేబుల్‌పై నమోదైన కేసుపై సైతం సంజాయిషీ, ఆపై నేర నిరూపణ నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. ఒకేరోజు మూడు నోటీసులు ఇవ్వడం గమనార్హం. సదరు కానిస్టేబుల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకే ఈ చర్యలన్నీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని