logo

విశాఖ పోటీలకు ఎంపికైన జిల్లా బాక్సర్లు

వచ్చే నెలలో విశాఖలో జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా బాక్సర్లను ఆదివారం ఎంపిక చేశారు. నగరంలోని కొత్తవూరు జూనియర్‌ కళాశాలలో ఎంపిక పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు

Published : 27 Jun 2022 06:02 IST


రాష్ట్ర బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: వచ్చే నెలలో విశాఖలో జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా బాక్సర్లను ఆదివారం ఎంపిక చేశారు. నగరంలోని కొత్తవూరు జూనియర్‌ కళాశాలలో ఎంపిక పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా బాక్సింగ్‌ సంఘం కార్యదర్శి శ్రీకాంత్‌, సంయుక్త కార్యదర్శి ఉదయ్‌, ఈసీ సభ్యురాలు జయవాణిల సమక్షంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఎంపికైన వారి వివరాలు.. యూత్‌ బాలుర విభాగంలో ఆదిత్య, బాలికల విభాగంలో స్రవంతిలు ఎంపికయ్యారు. సీనియర్‌ బాలుర విభాగంలో ప్రణయ్‌, నరేష్‌, నరసింహా, విజయ్‌, లాలూనాయక్‌లు ఎంపికకాగా.. బాలికల విభాగంలో తన్మయి, ప్రవల్లికలు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో 25 నుంచి విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని