logo

ఆకతాయిలను అడ్డుకోబోయి.. హోంగార్డుకు గాయాలు

మద్యానికి బానిసైన నలుగురు బాలురు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. అనుమానం కలిగిన కదిరి అర్బన్‌ సీఐ మధు, సిబ్బంది వారు ప్రయాణిస్తున్న ఆటోను అడ్డుకునేందుకు యత్నించే క్రమంలో హోంగార్డు శేఖర్‌ గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు

Published : 27 Jun 2022 06:02 IST


గాయపడ్డ హోంగార్డు శేఖర్‌

కదిరి పట్టణం: మద్యానికి బానిసైన నలుగురు బాలురు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. అనుమానం కలిగిన కదిరి అర్బన్‌ సీఐ మధు, సిబ్బంది వారు ప్రయాణిస్తున్న ఆటోను అడ్డుకునేందుకు యత్నించే క్రమంలో హోంగార్డు శేఖర్‌ గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. కదిరికి చెందిన ఐదుగురు బాలురు మద్యానికి అలవాటు పడి రోజూ తాగేవారు. వీరిలో ఒక బాలుడి కుటుంబ సభ్యులు పరిస్థితి గుర్తించి మిగతా నలుగురితో కలవకుండా ఆపేశారు. స్నేహితుడిని తమతో కలవకుండా ఆపేసిన బాలుడి తల్లిదండ్రులపై మిగతా నలుగురు దాడి చేశారు. వారిపై బాధితులు ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సీఐ.. సిబ్బందితో కలిసి దర్యాప్తులో భాగంగా ఫిర్యాదు చేసిన వారి ఇంటి వద్దకు వెళ్తున్నారు. అదే సమయంలో నలుగురు బాలురుతో ఉన్న ఆటో ఎదురుగా వస్తున్న కారును ఢీకొని అతివేగంగా ముందుకు వెళ్లింది. గుర్తించిన సీఐ, హోంగార్డు శేఖర్‌ ఆటోను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శేఖర్‌ వైపు ఆటో దూసుకురావడంతో ఆయన గాయపడ్డారు. బాలుడి తల్లిదండ్రులపై దాడి చేసింది ఆటోలో వెళ్తోన్న నలుగురేనని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని