logo

సంక్షేమ పాలన ప్రభుత్వ లక్ష్యం

సంక్షేమ పాలన అందించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ వైకాపా ప్లీనరీకి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు

Published : 27 Jun 2022 06:02 IST

మాట్లాడుతున్న వైకాపా పరిశీలకులు ఎస్వీ మోహన్‌రెడ్డి

అనంతపురం(మూడోరోడ్డు): సంక్షేమ పాలన అందించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ వైకాపా ప్లీనరీకి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2024లో వైకాపా గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కార్యకర్తలు నిస్వార్థంతో పని చేయడంతోనే తాము ప్రజాప్రతినిధులుగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.

అతిథుల ప్రసంగం పట్టని కార్యకర్తలు

ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.20 గంటలకు ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనంతపురం జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా కార్యకర్తలు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లి పోయారు. కొందరు చెట్ల కింద సేద తీరగా.. మరి కొందరు ఇళ్లకు వెళ్లి పోయారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ వసీం, ఉప మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహితీ, అహుడా ఛైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, కిష్టప్ప, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని