logo

తెదేపా నాయకుడిపై హెడ్‌కానిస్టేబుల్‌ దాడి

న్యాయం చేయాలని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన టతెదేపా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డిపైనే హెడ్‌కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి దాడికి పాల్పడిన ఘటన సోమవారం కణేకల్లులో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..

Published : 28 Jun 2022 04:50 IST

బాధితుడిని విచారిస్తున్న సీఐ యుగంధర్‌

కణేకల్లు: న్యాయం చేయాలని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన టతెదేపా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డిపైనే హెడ్‌కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి దాడికి పాల్పడిన ఘటన సోమవారం కణేకల్లులో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కణేకల్లు మండలం జక్కలవడికి గ్రామానికి చెందిన సర్పంచి శారదమ్మ భర్త వైకాపా నాయకుడు హనుమంతరెడ్డి నుంచి రూ.59 వేలు అప్పుగా ఎర్రిస్వామిరెడ్డి తీసుకున్నారు. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా.. ప్రస్తుతం చెల్లించలేనని, గడువు ఇవ్వాలని కోరారు. దీంతో వైకాపా నాయకుడు తెదేపా నాయకుడికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకోగా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు తన భార్య శ్రీదేవితో కలిసి స్టేసన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ ఎలాంటి విచారణ చేయకుండా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పేది పట్టించుకోకుండా దుర్భాషలాడినట్లు వాపోయారు. చేతులెత్తి మొక్కుతున్నా హెడ్‌కానిస్టేబుల్‌ కనికరించలేదన్నారు.  

హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయాలి: న్యాయం కావాలంటూ పోలీసుస్టేషన్‌కు వెళ్లిన తెదేపా నాయకుడిపై దాడికి పాల్పడిన హెడ్‌కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ తీరుపై కణేకల్లు పోలీసుస్టేషన్‌ ఎదుట తెదేపా నాయకులతో ఆందోళన చేపట్టేందుకు అనంతపురం నుంచి వస్తున్న మాజీ మంత్రిని సీఐ యుగంధర్‌ కణేకల్లు క్రాసింగులో అడ్డుకున్నారు. తెదేపా నాయకుడు ఆనందరాజు ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి వచ్చిన బాధితుడు మాజీ మంత్రి, సీఐకి ఘటన గురించి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు