logo

వరద వేగం.. మట్టికేం తెలుసు?

గతేడాది నవంబరులో చిత్రావతి నదికి వచ్చిన వరదలకు శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో పలుచోట్ల రహదారులతోపాటు కాజ్‌వేలు, వంతెనలు దెబ్బతిన్నాయి. పుట్టపర్తి సమీపంలో రాయలవారిపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని కాజ్‌వే పూర్తిగా ధ్వంసమైంది.

Published : 28 Jun 2022 04:50 IST

ధ్వంసమైన కాజ్‌వే పక్కన జవనరిలో వేసిన మట్టిరోడ్డు (పాతచిత్రం)

తేడాది నవంబరులో చిత్రావతి నదికి వచ్చిన వరదలకు శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో పలుచోట్ల రహదారులతోపాటు కాజ్‌వేలు, వంతెనలు దెబ్బతిన్నాయి. పుట్టపర్తి సమీపంలో రాయలవారిపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని కాజ్‌వే పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు రెండునెలల పాటు ఆ గ్రామస్థులు సంబంధిత అధికారులకు విన్నవించగా.. ఎట్టకేలకు జనవరిలో మట్టిరోడ్డు ఏర్పాటు చేశారు. ఇసుక బస్తాలతో కాకుండా కేవలం మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిదారి కొట్టుకుపోయింది. వర్షాకాలం ప్రారంభంలోనే చిన్నవర్షానికే దారి దెబ్బతినడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిలో చిన్నపాటి ప్రవాహం కొనసాగుతుండటంతో గ్రామస్థులు అత్యవసరమైతే తప్ప రాకపోకలు సాగించటం లేదు. గతేడాది వరదలకు ధ్వంసమైన కల్వర్టులు, కాజ్‌వేలు, వంతెనలు, రహదారుల వద్ద అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకొన్నారు. ఈ ఏడాది మళ్లీ వరదలు వస్తే ముప్పు తప్పదని చిత్రావతి నది పరివాహక గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల చిత్రావతి నదికి వచ్చిన వరదకు కొట్టుకుపోయిన మట్టిరోడ్డు

- ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, పుట్టపర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని